వరంగల్‌: 9 మంది మృతి కేసులో కొత్త ట్విస్ట్...!

వరంగల్‌: 9 మంది మృతి కేసులో కొత్త ట్విస్ట్...!

వరంగల్ నగర శివారులోని గీసుగొండ మండలం గొర్రెకుంట ప్రాంతంలో పాడుబడ్డ బావిలో అనుమానస్పదంగా తొమ్మిది మృతదేహాలు లభించడం సంచలనం రేపుతోంది.. అయితే, ఇప్పుడు కేసులు ఊహించని ట్విస్ట్ వచ్చిపడినట్టు తెలుస్తోంది.. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. మక్సూద్ ఆలం తన భార్య పిల్లలతో కల్సి కరీమాబాద్ ప్రాంతంలో నివాసం వుంటూ గొర్రెకుంటలోని గోనె సంచుల గోదాం పనిచేస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో గోదాంకు ఇంటికి రాకపోకలు ఇబ్బంది కావడంతో గోదాంలోనే కొద్ది కాలం నుంచి నివాసం ఉంటున్నారు.. గత 45రోజులగా గోదాంలోని భవనంలో నివాసం ఉంటున్నారు.. ఇదే భవనంలో బీహర్ రాష్ట్రానికి చెందిన శ్రీరాం, శ్యాంలు కుడా పనిచేసుకుంటు వుంటున్నారు. మొన్న గోదాంకు వచ్చిన యజమానికి ఎవరూ కనిపించకపోవడంతో కంగారు పడ్డాడు.. మక్సూడ్, మక్సూడ్ భార్య నిషా, కూతూరు బుధ్రా, మనుమడు మక్సూడ్ చిన్నకోడుకు సొహైయిల్, పెద్దకుమారుడు మరియు బీహర్‌కు చెందిన శ్రీరాం, శ్యాంలు మొత్తం ఎనిమిది మంది కనిపించకుండా పోవడంతో గోదాం యజమాని భాస్కర్‌ తన వ్యాపార భాగస్వామి అయిన సూర్యదేవర సంతోష్ మరియు మిగితా వర్కర్లతో కలిసి వెతికారు.. ఇక, నిన్న మధ్యాహ్నం  2గంటల సమయంలో గోదాంకు ప్రక్కనే వున్న పాడుబడిన బావిలో కనిపించకుండా పోయిన మక్సూడ్ అలంతో పాటు కుటుంబ సభ్యులైన, భార్య నిషా, కూతూరు బుధ్రా, మనుమడు చనిపోయి శవాలుగా కనిపించడంతో గోదాం యజమాని గీసుగొండ పోలీసులకు సమాచారం ఇచ్చారు.. రంగంలోకి పోలీసులు దర్యాప్తు భాగంగా ఈ రోజు శవాలను గుర్తించిన పాడుపడిన బావిలోని నీటిని తొలగిస్తున్న క్రమంలో మరో ఐదుగురి మృతదేహాలను బయటపడ్డాయి. 

వీరిలో మరణించిన మక్సూడ్ ఆలం ఇద్దరు కుమారులు షాబాద్ ఆలం, సొహైయిల్ ఆలం శ్రీరాం, శ్యాం మరియు షకీలు గుర్తించడం జరిగింది. ఈ సంఘటలో మొత్తం 9మంది మృతిచెందడంతో కలకలం రేగుతోంది.. మరోవైపు ఈ కేసులు కొత్త ట్విస్ట్ వెలుగు చూసినట్టు తెలుస్తోంది... ఆత్మహత్యలా? హత్యలా? తెలియాల్సి ఉండగా.. ఈ ఘటన వెనుక అక్రమ సంబంధం కోణం ఉందనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. మక్సుద్ భార్య, కూతురు.. వివాహేతర సంబంధాలు ఉన్నాట్టు అనుమానిస్తున్నారు.. షకీల్‌తో మక్సుద్ భార్యకు సంబంధం ఉండగా.. బీహారీలు శ్రీరామ్, శ్యామ్‌తో మక్సుద్ కూతురుకి అక్రమ సంబంధం ఉందంటున్నారు.. ఇక, కొత్తగా యాకూబ్‌తో కూడా మక్సుద్ కూతురు ఎఫైర్‌ పెట్టుకుంది అంటున్నారు.. ప్లాన్ ప్రకారం షకీల్‌ను పార్టీకి పిలిచిన మక్సుద్‌.. ఈ ఘాతుకానికి పాల్పడినట్టు అంచనాకు వచ్చినట్టు సమాచారం.. అయితే, ఈ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం మాత్రం తెలియాల్సి ఉంది.