ఈ ఏడాది నుంచే ఫస్ట్ ఇంటర్ లో కొత్త సిలబస్ 

ఈ ఏడాది నుంచే ఫస్ట్ ఇంటర్  లో కొత్త సిలబస్ 

ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరంలో నూతన సిలబస్‌ను ప్రవేశపెడుతున్నట్లు ఏపీ ఇంటర్‌ బోర్డు కమిషనర్‌‌ ఉదయలక్ష్మి తెలిపారు. ఇందుకు సంబంధించి నూతన సిలబస్‌తో రూపొందించిన పాఠ్యపుస్తకాలను ఆమె ఈరోజు సచివాలయంలో విడుదల చేశారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ విద్యాసంవత్సరం నుంచే కొత్తసిలబస్ అమలులోకి వస్తుందని.. అప్పుడే 10 లక్షల పాఠ్యపుస్తకాలను అందుబాటులోకి తెచ్చామని ఆమె వివరించారు. భాషా పాఠ్యపుస్తకాల వరకు నూతన సిలబస్ ప్రవేశపెడుతున్నామని.. మిగిలిన సబ్జెక్టుల్లో కొన్ని కొత్త ఛాప్టర్లు అదనంగా చేర్చినట్టు తెలిపారు. వచ్చే ఏడాది ఇంటర్‌ రెండో సంవత్సరంలో నూతన సిలబస్‌ తో పుస్తకాలను విడుదల చేస్తామని ఉదయలక్ష్మి  వెల్లడించారు.