మరో కొత్త పధకాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం జగన్

మరో కొత్త పధకాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం జగన్

ఏపీ మత్స్యకారుల జీవితాల్లో శాశ్వత మార్పు రావాలని కోరుకుంటున్నామన్నారు ఏపీ సీఎం జగన్. క్యాంప్ ఆఫీస్ నుంచి మత్స్యకార  భరోసా పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ పధకం ద్వారా 10,9231 కుటుంబాలకు పది వేల చొప్పున ఇస్తున్నామని చెప్పారు జగన్. జాలర్లు గుజరాత్ కు వలస పోకూడదనే 3 వేల కోట్లతో ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. మత్స్యకారుల వలసలు నిరోధించి శాశ్వత ఉపాధి కల్పన అందిస్తామని అన్నారు జగన్. కరోనాతో పోరాడుతున్న సమయంలో కూడా, ఇన్ని కష్టాలు ఉన్నా సరే..  మత్స్యకారుల కష్టాలు పెద్దవి అని భావించి.. మత్స్యకార భరోసాను అమలు చేస్తున్నామని చెప్పారు సీఎం.  గతంలో వేట నిషేధ సమయంలో చాలీచాలని విధంగా రూ.4వేలు అదికూడా అందరికీ ఇచ్చేవారు కాదని సీఎం గుర్తుచేశారు.. మత్స్యకార సోదరులకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా భావించి వారి బతుకులు మారాలని ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని అన్నారు..