కరోనా పాజిటివ్ వ్యక్తులను ఈజీగా ఇలా గుర్తించవచ్చు...!!

కరోనా పాజిటివ్ వ్యక్తులను ఈజీగా ఇలా గుర్తించవచ్చు...!!

కరోనా ప్రభావం రోజు రోజుకు పెరిగిపోతున్న తరుణంలో దానిని గుర్తించడం, పరీక్షలు చేయడం ఆలస్యం అవుతున్నది.  కరోనా పాజిటివ్ అని తెలిసే సరికి ఒకరి నుంచి మరొకరికి వస్తున్నది.  దీంతో కరోనా పాజిటివ్ కేసులు గుర్తించడంలో ఆలస్యం అవుతున్నది.   అయితే, శాస్త్రవేత్తలు కరోనా పాజిటివ్ కేసులను గుర్తించేందుకు ఓ సులభమైన మార్గాన్ని కనిపెట్టారు.  కరోనా పాజిటివ్ కేసులు అనే అనుమానం ఉన్న వ్యక్తులు రుచి, వానసను గుర్తించడంలో కొంత విఫలం అవుతారట.  

కరోనా పాజిటివ్ కేసులున్న వ్యక్తులు ఎంతటి రుచికరమైన ఆహారం ఇచ్చినా దాని రుచిని గుర్తించలేకపోతున్నారని, అలానే వాసన విషయంలో కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ పద్దతిని ఉపయోగించి కరోనా పాజిటివ్ కేసులను గుర్తించేందుకు అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.  క్వారంటైన్ లో ఉన్న చాలా మంది పాజిటివ్ అని తేలకముందే రుచి, వాసనను గుర్తించలేకపోతున్నారని, తరువాత వారికీ పాజిటివ్ అని తేలిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.