ఈ డివైజ్ తో ఆరు అడుగుల దూరం నుంచే కరోనాను గుర్తించవచ్చట...!!

ఈ డివైజ్ తో ఆరు అడుగుల దూరం నుంచే కరోనాను గుర్తించవచ్చట...!!

కరోనా వైరస్ రోజు రోజుకు విస్తరిస్తున్న సంగతి తెలిసిందే.  బయటకు వెళ్ళాలి అంటే ప్రజలు భయపడిపోతున్నారు.  బయటకు వెళ్తే ఎవరికి కరోనా ఉందొ ఎవరికి లేదో తెలుసుకోవడం కష్టంగా మారింది.  కరోనా లక్షణాలను చెక్ చేసేందుకు రోజుకో రకమైన డివైజ్ లు, థర్మల్ స్కానర్ లు వస్తున్నాయి.  కరోనా నుంచి రక్షణ  పొందాలి అంటే ముఖానికి మాస్క్, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అయ్యింది.  బయటకు వెళ్తే ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటిస్తారని గ్యారెంటీ లేదు.  అలాంటప్పుడు ఎదురుగా ఉన్న వాళ్లకు కరోనా ఉన్నదా లేదా అని  తెలుసుకోవడం కష్టం అవుతుంది.  

అందుకోసమే అమెరికాలో నివసిస్తున్న రాహుల్ రెడ్డి భారతీయుడు ఓ డివైజ్ ను తయారు చేశాడు.  ఈ డివైజ్ ఆరు అడుగుల దూరంలో అధిక ఉష్ణోగ్రత ఉన్న వ్యక్తులను ట్రాక్ చేస్తుంది.   ఫలితంగా అక్కడి నుంచి మనం పక్కకు తప్పుకొని వెళ్లొచ్చని అంటున్నారు.  అయితే, ఈ డివైజ్ ను కమర్షియల్ గా విపణిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు రాహుల్ రెడ్డి తెలిపారు.