ఆ భామకు చిరుత సీక్వెల్ చేయాలనిపిస్తుందట...!

ఆ భామకు చిరుత సీక్వెల్ చేయాలనిపిస్తుందట...!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టాలీవుడ్ కు 'చిరుత' సినిమాతో పరిచయమయ్యాడు. అయితే అందులో అతనికి జంటగా నటించిన బ్యూటీ నేహా శర్మ.  మొదటి స్నినిమాలోనే అందాల ఆరబోసింది అందరిని ఆకట్టుకుంది. ఆ సినిమా తర్వాత తెలుగులో ఒకటి రెండు సినిమాలు చేసిన తరువాత బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో అక్కడికి వెళ్ళిపోయింది నేహా.  అయితే ఎప్పుడు హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో అభిమానులకు దగ్గరగానే ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ భామకు తిరిగి తెలుగులో నటించాలని ఉందట. అది కూడా తాను టాలీవుడ్ కు పరిచయమైనా చిరుత సినిమా సీక్వెల్ తో మళ్ళీ మెగా పవర్ స్టార్ కు జంటగా నటించాలని ఉంది అని తెలిపింది. అయితే చుడాలిమరి ఈ విషయం పైన హీరో కానీ దర్శకుడు కానీ స్పందిస్తాడా లేదా అనేది. అయితే చిరుత సినిమా 2007లో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చి మంచి టాక్ తెచ్చుకుంది.