నేహా ధూపియాలో దాగి ఉన్న టాలెంట్ చూసి ఫిదా అవుతున్న నెటిజన్స్

నేహా ధూపియాలో దాగి ఉన్న టాలెంట్ చూసి ఫిదా అవుతున్న నెటిజన్స్

నేహా ధూపియా తన అందాల ఆరబోతతో బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగింది. టాలీవుడ్‌లోనూ కొన్ని సినిమాలు చేసింది. వయసు పెరగడం, వంపుసొంపుల్లో గ్లామర్ తగ్గడం, కుర్ర హీరోయిన్ల పోటీ ఎక్కువ కావడంతో క్రమంగా వెండితెర నుంచి దూరమైంది. ఇప్పుడు టీవీ షోలు చేసుకుంటూ కాలం గడుపుతోంది.నేహా ధూపియా లాక్‌డౌన్ వలన ఇంటికే పరిమితమైంది. ఈ ఖాళీ సమయంలో తనలో దాగి ఉన్న ఆర్ట్ వర్క్ బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. దివగంత నటులు ఇర్ఫాన్ ఖాన్, శ్రీదేవిల గ్రాఫిటీ ఆర్ట్ వర్క్ తన ఇంటికి రెండు కిలో మీటర్ల దూరంలో వేసినట్టు నేహా తన సోషల్ మీడియా పేజ్ ద్వారా తెలిపింది. ఇందుకు సంబందించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. నేహా లో దాగి ఉన్న ఈ టాలెంట్ ను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు . అమ్మడిలో ఇంత  టాలెంట్ ఉందా ..!అంటూ ఆశ్చర్యపోతున్నారు . ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి