రెండు నెలలుగా పదివేలమంది... సముద్రంలోనే... నరకం...!!

రెండు నెలలుగా పదివేలమంది... సముద్రంలోనే... నరకం...!!

విదేశీయులు ఖాళీ సమయం దొరికితే విహారయాత్రలకు వెళ్తుంటారు.  ముఖ్యంగా క్రూయిజ్ షిప్పుల్లో వివిధ ప్రాంతాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు.  అయితే, ఇప్పుడు కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఎవరూ కూడా బయటకు రావడం లేదు.  ఎక్కడ ఉండే వ్యక్తులు అక్కడే ఉండిపోవాలని ప్రపంచంలోని చాలా దేశాలు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.  అమెరికాలో కూడా మొన్నటి వరకు ఇలాంటి ఆంక్షలు ఉన్నాయి.  అమెరికాలోని మియామి సముద్రంలో పదుల సంఖ్యలో క్రూయిజ్ షిప్పులు నిలిచిపోయాయి.  

కాగా, ఈ షిప్పుల్లో 57వేలమంది వరకు ప్రయాణికులు ఉన్నారు.  వీరిని క్వారంటైన్ తరువాత పంపించివేశారు.  కానీ, అందులో పనిచేసే క్రూ సిబ్బంది మాత్రం సముద్రంలోని ఆ షిప్పుల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది.  రెండు నెలలుగా వీరంతా సముద్రంలోనే ఉండిపోయారు. నరకయాతన పడుతున్నారు.  ఎక్కువకాలం సముద్రంలో ఉంటె ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తాయి.  వీలైనంత త్వరగా తమకు ఇళ్లకు పంపించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.  అయితే, ఎప్పటి వరకు వీరికి అనుమతి వస్తుందో తెలియని పరిస్థితి.