నాకు గంగూలీ అంటే ఇష్టం లేదు... 

నాకు గంగూలీ అంటే ఇష్టం లేదు... 

మాజీ ఇంగ్లండ్ కెప్టెన్ నాజర్ హుస్సేన్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. తనకు భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అంటే ఇష్టం లేదు అని తెలిపాడు. అతను గంగూలీని ఎందుకు అసహ్యించుకున్నాడో వివరిస్తూ నాజర్... భారత మాజీ కెప్టెన్ ఎప్పుడూ టాస్ కోసం ఆలస్యంగా వస్తాడు , ఆట నుండి రిటైర్ అయిన తర్వాత నేను అతన్ని కామెంటరీ బాక్స్‌లో వేచి ఉంచినట్లే.  "నేను సౌరవ్‌తో ఆడినప్పుడు, అతనిని అసహ్యించుకున్నాను, అతను నన్ను టాస్ కోసం ప్రతిసారీ వేచి ఉండేలా చేసేవాడు అని నాజర్ చెప్పాడు. అయితే నేను అతనితో గత దశాబ్ద కాలంగా కామెంట్రీ చెప్తున్నాను, ఇక అతను ఆటలో ఏ విధంగా నన్ను వేచి ఉండేలా చేసాడో నేను ఇప్పుడు అతడిని అలాగే చేస్తున్నాను అని చెప్పడు. కానీ ఈ ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడికి భారత జట్టును గొప్ప జట్టుగా మార్చిన ఘనత కూడా లభిస్తుంది అని చెప్పాడు . మైదానంలో దూకుడుగా ఉన్న సౌరవ్ గంగూలీ తనలాగే ఉండే  క్రికెటర్లను ఎంపిక చేశాడని హుస్సేన్ చెప్పాడు, ఇక ఆటనుండి విడదీసి చూస్తే దాదా ఓ ప్రశాంతమైన మనిషి అని తెలిపాడు.