ప్రతిపక్షం లేదు... కేవలం శత్రువులే ఉన్నారు!

ప్రతిపక్షం లేదు... కేవలం శత్రువులే ఉన్నారు!

మహానాడు ప్రాంగణంలో సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి నారా లోకేష్... మహానాడు శిబిరంలో రక్తదానం చేసిన లోకేష్... వివిధ స్టాళ్లను పరిశీలించిన అనంతరం మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ... తెలుగు ప్రజలకు ప్రధాన శత్రువు భారతీయ జనతా పార్టీయే అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు, కేవలం శత్రువులు మాత్రమే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో జరిగిన మహానాడుకు మించి విజయవాడలో జరుగుతున్న మహానాడుకు అధికసంఖ్యలో అభిమానులు హాజరయ్యారని... 33 శాతం అధికంగా మహానాడులో రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు లోకేష్. 

తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నవారిపై ఘాటుగా స్పందించారు మంత్రి నారా లోకేష్... ఏనాడూ ఆస్తులు ప్రకటించని వాళ్లు మాపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డ ఆయన... చంద్రబాబు అవసరం ఏపీకి ఉందన్నారు. వైపీసీ ఎంపీల రాజీనామాలపై స్పందిస్తూ... ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్న ఏపీ ఐటీ మంత్రి... నంద్యాల, కాకినాడలో ఏం జరిగిందో  అంతా చూశారు... బైపోల్స్ వస్తే మళ్లీ అదే జరుగుతుందన్నారు.