నాని చేతులమీదుగా జంబ లకడి పంబ

నాని చేతులమీదుగా జంబ లకడి పంబ
1993 లో ఈవీవీ సత్యన్నారాయణ దర్శకత్వంలో వచ్చిన జాంబ లకడి పంబ సినిమా ఎంతమందిని కితకితలు పెట్టించిందో చెప్పక్కరలేదు.  ఈ సినిమా వస్తుంటే ప్రేక్షకులు ఇప్పటికి టీవీకి అతుక్కుపోయి కూర్చుంటారు అనడంలో సందేహం లేదు.  అప్పట్లో ఈ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. కొత్త తరహా కథతో తనదైన కామెడీని జోడించి తీసిన ఆ సినిమా భారీ స్థాయిలో హిట్ అయింది.  
ఇదిలా ఉంటె, కామెడీ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న శివారెడ్డి ఇప్పుడు హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు.  తనకు అచ్చోచ్చిన కామెడీనే ప్రధానాంశంగా తీసుకొని సినిమాలు చేస్తున్నాడు.  అప్పట్లో హిట్ సాధించిన జంబ లకడి పంబ టైటిల్ ను తీసుకొని కామెడీ ప్రధానాంశంగా సినిమా చేస్తున్నాడు.  జేబి మురళి కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.  ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా నిర్మితమౌతున్న ఈ సినిమా ట్రైలర్ గురువారం రోజున న్యాచురల్ స్టార్ నాని చేతుల మీదుగా విడుదల కాబోతున్నది.  ఈవీవీ జంబ లకడి పంబ కు సీక్వెల్,  రీమేక్ గాని కాదని పూర్తిస్థాయి వినోదభరితంగా సినిమా ఉంటుందని యూనిట్ చెప్తోంది.