నందమూరి వర్సెస్‌ కొణిదెల వార్‌ ..వివాదానికి కారణం ఇదేనా...!

నందమూరి వర్సెస్‌ కొణిదెల వార్‌ ..వివాదానికి కారణం ఇదేనా...!

నందమూరి వర్సెస్‌ కొణిదెల వార్‌ ..వివాదానికి కారణం ఇదేనా...!

అసలు చిరంజీవి... బాలయ్యలకు ఏమైంది ? ఇండస్ట్రీలో ఈ అగ్రహీరోలు ఇద్దరి మధ్య గొడవ ఎలా ప్రారంభమైంది. ఎందుకు కంటిన్యూ అవుతోంది? అప్పుడప్పుడూ చల్లారినట్టు కనిపించినా మళ్లీ ఎందుకు సాధారణంగా హీరోల మధ్య గొడవ అంటే ఠక్కున గుర్తొచ్చేది చిరంజీవి.. మోహన్‌బాబే..!  ఏదో ఒక వేదిక మీద కైకైలు ఖచ్చితంగా ఉండేవి. కానీ అవి ఎందుకు? కారణం ఏంటి? అన్నది మాత్రం ఎవరికీ అర్ధం అయ్యేది కాదు. 75 ఇయర్స్‌ ఫంక్షన్లో అయితే ఆ సీన్‌ స్పష్టంగా కనిపింది. మోహన్‌బాబు స్పీచ్‌.. తర్వాత చిరంజీవి కౌంటర్‌.. ఆ తర్వాత  పవన్ కల్యాణ్ ఎమోషనల్‌ పంచ్‌లు.. ఇలా స్టేజ్‌ మీద ఏకంగా ఓ పిక్చర్‌నే అప్పట్లో చూపించారు.

ఆ తర్వాత అంతా చిన్నా చితకా వ్యవహారాలే కనిపించాయి. చిరంజీవి - బాలయ్య విషయానికి వస్తే... ఫంక్షన్స్‌లో కలిసినప్పుడల్లా నవ్వుతూ, జోకులేసుకుంటూ కనిపించేవారు. దీంతో వీళ్లిద్దరిమధ్యా ఎలాంటి వివాదాలు లేవని అంతా అనుకునేవారు. కానీ ఆరేళ్ల క్రితం లేపాక్షి వేదికగా చిచ్చు మొదలైంది. అప్పట్లో లేపాక్షి ఉత్సవాలను హిందూపురం ఎమ్మెల్యేగా బాలకృష్ణ భారాన్నంతా తన భుజాల మీద వేసుకుని మోసారు. అయితే, ఈ ఉత్సవాల్లో చిరంజీవి ఎక్కడా కనిపించలేదు. ఇదే విషయాన్ని మీడియా అప్పట్లో బాలయ్యని అడిగింది. అప్పుడు ఆయన చెప్పిన సమాధానంతో మొదలైంది అసలు కధ.

ఈ విషయం తెలిశాక కూడా చిరంజీవి దీనిపై రియాక్ట్‌ కాలేదు. బాలయ్య ఎంత ఘాటుగా మాట్లాడినా ఆయన లైట్‌గా తీసుకున్నట్టు మెసేజ్‌ చేశారు. అంతేకాదు ఇద్దరి మధ్యా ఎలాంటి విభేదాలు లేవని చెప్పేందుకు గౌతమిపుత్ర శాతకర్ణి ఓపెనింగ్‌కి కూడా చిరంజీవి వెళ్లారు. అందులో బాలయ్యను పొగడ్తలతో ముంచెత్తారు.
ఇది జరిగాక ఇద్దరి మధ్యా గొడవ చల్లారినట్టు కనిపించింది. చాలా సందర్భాల్లో మళ్లీ కలిశారు. అప్పట్లో హుద్‌హుద్‌ తుఫాన్‌ బాధితుల కోసం టాలీవుడ్‌ కొన్ని కార్యక్రమాల్ని నిర్వహించింది. దీనికి బాలయ్యను కూడా ఆహ్వానించారు చిరంజీవి. ఈ ఇద్దరు అగ్రహీరోలు కలిసి కార్యక్రమాన్ని సక్సెస్‌ చేశారు.

ఈ ఈవెంట్‌ చూసినవారంతా ఇద్దరిమధ్యా ఇంకే గొడవల్లేవ్‌.. అంతా సద్దుమణిగింది అనుకున్నారు. కానీ ఇంతలోనే నాగబాబు రూపంలో మరో బాంబు పేలింది. బాలయ్యా ? ఆయన ఎవరో తనకు తెలీదంటూ తన యూట్యూబ్‌ ఛానెల్లో ఆయన మాట్లాడడంతో పుండు మీద కారం జల్లినట్టయింది. ఈవిధంగా మెగా తమ్ముడు మళ్లీ పాత గాయాన్ని రేపాడు.

ఇంకేముంది? నాగబాబు వ్యాఖ్యలు ఇష్యూ అయ్యాయి. కొన్నాళ్ల పాటు రచ్చ కంటిన్యూ అయింది. ఇటు చిరంజీవి.. అటు బాలయ్య... అభిమానులు సోషల్‌ మీడియా సెంటర్‌గా వార్‌ కంటిన్యూ చేశారు. అయితే మళ్లీ చిరంజీవే ఓ మెట్టు దిగి వచ్చారు. బాలయ్య గురించి తనకు తెలుసని... ఆయనది చిన్నపిల్లల మనస్థత్వమని రాజీకి జెండా ఊపారు. అన్నయ్య ఆదేశాలతో నాగబాబు కూడా ఈ గొడవ ఇంతటితో ముగిస్తున్నానని అప్పట్లో చెప్పుకొచ్చారు.

ఇదంతా జరిగి ఏడాది పైనే అవుతోంది. ఇంతవరకు అంతా బాగానే ఉంది. ఇండస్ట్రీలో చిన్నా చితగా గొడవలు జరుగుతున్నా... వీరిద్దరి పేర్లు మాత్రం ఎక్కడా బయటకు రాలేదు. బాలయ్య రాజకీయాల్లో బిజీ అయిపోగా... ఇటు చిరంజీవి కూడా షూటింగ్స్‌ హడావిడిలో పడిపోయారు. దీంతో వ్యవహారం అంతా సైలెంట్‌ అయిపోయింది. మళ్లీ వీరిద్దరి మధ్య ఏదో ఒక రచ్చ వస్తుందని కూడా ఎవరూ ఊహించలేదు. కానీ అనుకోని విధంగా మరోసారి జూలు విదిల్చిన సింహం కాంట్రవర్సీ కామెంట్స్‌ చేయడంతో నందమూరి వర్సెస్‌ కొణిదెల వార్‌ తెరమీదికి వచ్చింది.