ధనుష్ తో సినిమా పక్కా!

ధనుష్ తో సినిమా పక్కా!

కొద్దిరోజుల క్రితం హీరో నాగార్జున.. తమిళ స్టార్ హీరో ధనుష్ తో కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఈ విషయం నిజమనే సంకేతాలు అందుతున్నాయి. రజినీకాంత్ కోసం ధనుష్ ఓ కథ రాసుకున్నాడని కానీ ఇప్పుడు తలైవా రాజకీయాలతో బిజీగా ఉండడంతో ఆ కథను తనతో చేయాలనుకుంటున్నట్లు నాగార్జున వెల్లడించారు. గతంలో ధనుష్ దర్శకుడిగా రెండు సినిమాలు చేశారు. ఇప్పుడు మరోసారి మెగాఫోన్ పట్టుకోవడానికి రెడీ అవుతున్నారు. 

ప్రస్తుతం ధనుష్ నిర్మించిన 'కాలా' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక నాగార్జున నటించిన 'ఆఫీసర్' ఈ వారంలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది కాకుండా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ తప్ప నాగార్జున మరే సినిమాకు సైన్ చేయలేదు. 'బంగార్రాజు' సినిమా కూడా ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. కాబట్టి త్వరలోనే ధనుష్ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు.