రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న నాగ శౌర్య కొత్త చిత్రం 

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న నాగ శౌర్య కొత్త చిత్రం 

తెలుగు యంగ్ హీరోల్లో నాగ శౌర్య ఒకడు. గతేడాది ఛలో సినిమాతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని తన ఖాతలో వేసుకున్నాడు. ఈ హీరో తాజాగా నటించిన చిత్రం "అమ్మమ్మగారిల్లు". సుందర్ సూర్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. రీసెంట్ గానే టీజర్ ను రిలీజ్ చేయగా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను నాగ శౌర్య అందిస్తున్నాడని హింట్ ఇచ్చేసింది. 

ఫ్యామిలీ ఎమోషన్స్ ను పెద్ద పీఠ వేసి తెరకెక్కించిన ఈ చిత్రంలో నాగ శౌర్య సరసన షామిలీ హీరోయిన్ గా నటించింది. తాజాగానే రెండు పాటలను రిలీజ్ చేయగా కూల్ మెలోడీస్ గా శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడడం విశేషం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను మే 25న రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కళ్యాణ్ రమణ సంగీతం సమకూర్చగా, రాజేష్ నిర్మించారు.