అల్లరి నరేష్‌ బర్త్‌డే గిఫ్ట్.... 'నాంది' ఎఫ్ఐఆర్ టీజర్

అల్లరి నరేష్‌ బర్త్‌డే గిఫ్ట్.... 'నాంది' ఎఫ్ఐఆర్  టీజర్

ఇండస్ట్రీ లో మొదటి సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న హీరో అల్లరి నరేష్ . తన సినిమాలలో కామెడీ టైమింగ్.. నటనతో మంచి పేరును సంపాదించుకున్నాడు. సీనియర్ల తరం తర్వాత మంచి కామెడీని పంచుతున్న హీరో అల్లరి నరేష్ . త్వరలో వినూత్న కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.  నరేష్ కెరీర్లో 57వ సినిమా గా సామాజిక కథాంశం తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు "నాంది" అనే టైటిల్ ఫిక్స్ చేశారు.అల్లరి నరేష్ కెరీర్లో ఇదివరకు నేను గమ్యం శంభో శివ శంభో సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందాడు. ఈ సినిమా కూడా ఆద్యంతం ఆసక్తికరంగా సామాజిక అంశాల మేళవింపుతో క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. డైరెక్టర్ సతీష్ వేగేశ్న నిర్మాతగా మారి నిర్మిస్తున్న ఈ సినిమాతో విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడుఇటీవల చిత్రానికి సంబంధించి పోస్టర్ విడుదల చేశారు. ఇందులో అల్లరి నరేష్ పోలీస్ స్టేషన్‌లో నగ్నంగా కింద కూర్చుని ఉన్నాడు. ఇక ఈ రోజు నరేష్ బర్త్‌డే కావడంతో 'నాంది' ఎఫ్ఐఆర్ (ఫస్ట్ ఇంపాక్ట్ రివీల్‌)టీజర్ ను విడుదల చేశారు. ఇది అభిమానులని ఎంతగానో అలరిస్తుంది. వరలక్ష్మీ శరత్‌కుమార్‌, హరీష్ ఉత్తమన్‌, ప్రియదర్శి, ప్రవీణ్ కీలక పాత్రలు పోషించారు.వినూత్న కథతో రూపొందుతున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.