నా నువ్వే ను ఏ రేంజ్ లో ప్రమోషన్ చేస్తున్నారంటే..!!

నా నువ్వే ను ఏ రేంజ్ లో ప్రమోషన్ చేస్తున్నారంటే..!!
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నా నువ్వే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి.  ఇటీవలే విడుదలైన పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి.  ఈనెల 25న సినిమా విడుదల కాబోతున్నది.  సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను వినూత్నంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  ప్రమోషన్లలో భాగంగా 400 క్యాబ్ లను వినియోగిస్తున్నారట.  ఈ క్యాబ్ లపైన నా నువ్వే సినిమా పోస్టర్లు దర్శనం ఇవ్వబోతున్నాయి.  
రజినీకాంత్ కబాలీ సినిమా పోస్టర్లు ఎయిర్ ఏషియా విమానాలపై దర్శనం ఇచ్చాయి.  ఇదే రీతిలో కాలా సినిమాను కూడా ప్రమోషన్ చేస్తున్నారు.  కబాలీ, కాలా సినిమాల ప్రమోషన్లను స్పూర్తిగా తీసుకొని నా నువ్వే సినిమాను ప్రమోషన్ చేస్తున్నారు నిర్మాతలు.  రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు జయోంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.  మహేష్ కోనేరు, విజయ్, కిరణ్ ముప్పవరపు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు శరత్ సంగీతం అందిస్తున్నారు.