శశాంక్ మనోహర్ దిగిపోతే మనకు మంచిదే...

శశాంక్ మనోహర్ దిగిపోతే మనకు మంచిదే...

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛైర్మన్‌గా శశాంక్ మనోహర్ వైదొలగడం మనకు మంచిదే అని మాజీ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియా (బీసీసీఐ) అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ అన్నారు. రెండు సంవత్సరాల పదవీకాలం తర్వాత శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్ బాధ్యతల నుండి వైదొలిగినట్లు బుధవారం ఐసీసీ తెలిపింది. అందువల్ల మరో కొత్త చైర్మన్ ను ఎన్నుకునే వరకు ప్రస్తుత డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజా ఆ బాధ్యతలు నిర్వహిస్తారని బోర్డు సభ్యులు తెలిపారు. ఐసీసీ చైర్మన్ గా మనోహర్ తన నిర్ణయాలతో భారత క్రికెట్‌కు చాలా నష్టం కలిగించాడని చెప్పిన శ్రీనివాసన్, మనోహర్ తన పదవికి రాజీనామా చేసినందుకు భారత క్రికెట్ చాల సంతోషంగా ఉంటుందని అన్నారు. అతను ఆటలో భారతదేశ ఆర్ధికవ్యవస్థను దెబ్బతీశాడు, అతను భారతీయ వ్యతిరేకి మరియు ప్రపంచ క్రికెట్లో భారతదేశ ప్రాముఖ్యతను తగ్గించాడు అని తెలిపాడు.