కిమ్ చేతిపై అనుమానాస్పద గుర్తు... ఏమై ఉంటుంది...?

కిమ్ చేతిపై అనుమానాస్పద గుర్తు... ఏమై ఉంటుంది...?

కిమ్ జోంగ్ ఉన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమి లేదు.  అయన ఎటువంటి వ్యక్తి అనే విషయం కూడా అందరికి తెలిసిందే.   కిమ్ పరిపాలనలో ఉత్తర కొరియా ఎంతగా దిగజారిపోయిందో చెప్పక్కర్లేదు.  ఇక ఇదిలా ఉంటె, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఏప్రిల్ 11 తరువాత మీడియాకు కన్పించలేదు.  

దీంతో అనేక వదంతులు వ్యాపించాయి.  కిమ్ ఆరోగ్యం బాగా లేదని, కిమ్ అనారోగ్యంతో బాధపడుతున్నారని, గుండె ఆపరేషన్ జరిగిందని, అయన మరణించారని కూడా వార్తలు వచ్చాయి.  కానీ, ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని మే 1 వ తేదీన రుజువైంది.  మే 1 వ తేదీన ఉత్తర కొరియా రాజధాని పాంగ్యాంగ్ కు సమీపంలో ఓ ఎరువుల ఫ్యాక్టరీని ఓపెన్ చేసేందుకు హాజరయ్యి షాక్ ఇచ్చాడు.  దానికి సంబంధించిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి.  ఆ ఫొటోల్లో కిమ్ కుడిచేతి మణికట్టు వద్ద ఏదో చిన్న మార్క్ ఒకటి కనిపించింది.  ఆ మార్క్ ఏంటి అన్నది ఇప్పుడు ప్రశ్నర్ధకంగా మారింది.  హృదయనాళ సర్జరీకి సంబంధించినదై ఉండొచ్చని అంటున్నారు.