ఫ్లాట్ల రుణాల‌ను మాఫీ చేస్తా... జ‌గ‌న్‌

ఫ్లాట్ల రుణాల‌ను మాఫీ చేస్తా... జ‌గ‌న్‌

ఇపుడు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఇస్తున్న ఫ్లాట్ల‌ను తీసుకోవాల‌ని, త‌మ ప్ర‌భుత్వం వ‌చ్చాక ఆ ఫ్లాట్ల‌పై ఉన్న రుణాన్ని మాఫీ చేస్తాన‌ని వైకాపా అధినేత వైఎస్ జ‌గ‌న్ అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయ‌న ఇవాళ‌  భీమవరంలో జరిగిన‌ బహిరంగ సభ మాట్లాడారు.  బీమవరం లో టిడిపి నాయకులకి చంద్రబాబు స్కాముల ఎలా చేయాలో శిక్షణ ఇస్తున్నాడని జ‌గ‌న్ ఆరోపించారు.  పేదవారికి ఇంటి నిర్మాణం కోసం ఇచ్చిన స్దలాలు లాక్కొని ప్లాట్లు ఇస్తానంటూ స్కాములకు చంద్ర‌బాబు తెరలేపార‌ని అన్నారు. చంద్రబాబు ప్లాట్లు ఇస్తే తీసుకోవాల‌ని, త‌మ ప్రభుత్వం వచ్చాక ప్లాట్ రుణం మాఫీ చేస్తాన‌ని జగన్ అభ‌య‌మిచ్చారు. వీరవాసరం మండలం లో రక్షిత తాగునీటి ప్రాజక్టుకు కేంద్రం అనుమతి ఇచ్చినా స్కాములతో ప్రాజక్టు ను తుంగలో తొక్కారన్నారు.  భీమవరం అంతా టిడిపి నాయకుల స్కాములతో అవినీతి కంపుతో నిండిపోయింద‌న్నారు. భీమవరం లో ట్రాపిక్ సమస్యలను పరష్కరించడానికి టిడిపి ప్రభుత్వం చేసిందేమీలేదని విమ‌ర్శించారు.  తుందుర్రు గ్రామాల లో ప్రజలు అక్వా పుడ్ పార్కు ను సముద్రతీరాని  తరలించమంటే అక్రమంగా కేసులు పెట్టించి.. ఆ త‌ర‌వాత  స‌మ‌స్యను చంద్ర‌బాబు  పట్టించుకోలేద‌ని జ‌గ‌న్ విమ‌ర్శించారు.త‌మ ప్రభుత్వం వచ్చాక  కచ్చితంగా అక్వా పార్క్ మారుస్తాన‌న్నారు. ప్రభుత్వ లాబ్ల‌ను మూసేస్తూ ప్రైవేటు  అక్వా లాబ్, హేచరీలను చంద్ర‌బాబు పెంచి పోషిస్తున్నార‌ని అన్నారు. చంద్రబాబు ఏడాదిపాటు మాత్రమే యూనిట్ 2 రూపాయ‌ల‌కు ఇస్తాని హామి ఇచ్చార‌ని...త‌మ  ప్రభుత్వం వస్తే 5ఏళ్ళ పాటు రూ.1.50కి ఆక్వా రంగానికి క‌రెంట్ ఇస్తాన‌ని అన్నారు.ఎన్ టిఆర్ ను   అన్నిరకాలుగా నాశనం చేసి...  ఆయన పుట్టినరోజున దండ వేసి మహానాడు చేస్తున్నాడని జ‌గ‌న్ ఎద్దేవా చేశారు.