‘మా నాన్న ఇక రాజకీయాల్లోకి రారు..’

 ‘మా నాన్న ఇక రాజకీయాల్లోకి రారు..’

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని ప్రధాని అభ్యర్థిగా  ఆరెస్సెస్‌ ప్రకటించే అవకాశం ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకునే ఆయనను ఆరెస్సెస్‌ సదస్సుకు ఆహ్వానించారని శివసేన చేసిన వ్యాఖ్యలను ఆయన కుమార్తె శర్మిష్ట ఖండించారు. ప్రణబ్‌ మళ్లీ రాజకీయాల్లో వచ్చే అవకాశమే లేదని ఆమె తేల్చి చెప్పారు. బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాకపోతే ప్రణబ్ పేరును తెరపైకి తెస్తారని శివసేన నేత సంజయ్ రౌత్ పేర్కొన్నారు. దీనికి స్పందించిన శర్మిష్ట.. 'మిస్టర్‌ సంజయ్‌ రౌత్‌..  మా నాన్న రాష్ట్రపతిగా పదవీ విరమణ పొందారు.  ఆయన రాజకీయాల్లోకి మళ్లీ వచ్చే అవకాశమే లేదు' అని ట్వీట్‌ చేశారు.