కుక్క నన్ను కాల్చేసింది...!

కుక్క నన్ను కాల్చేసింది...!

మీరు చదివింది నిజమే... ఆయన ముద్దుగా పెంచుకున్న కుక్కే ఆయను కాల్చేసింది... ఓ బుల్లెట్ యజమాని శరీరంలోకి దింపేసింది. ఈ ఘటన అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకుంది. తనను కాపాడాలంటూ అంబులెల్స్‌కు ఆ యజమాని ఫోన్ చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. 'నేను పెంచుకుంటున్న పెట్ డాగే నన్ను కాల్చేసింది... వెంటనే అంబులెన్స్ పపించాలంటూ ఓ వ్యక్తి ఎమర్జెన్సీ నెంబర్ 911కు కాల్ చేశాడా వ్యక్తి. వెంటనే అంబులెన్స్ రావడం ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు 51 ఏళ్ల రిచార్డ్... ఒక బుల్లెట్ ఆయన శరీరంలోకి దూసుకెళ్లింది. 

అయితే జరిగిన ఘటన గురించి ఆయన వివరిస్తూ తాను సోఫాలో కూర్చొని మా కుక్కతో ఆడుకుంటున్నాను. అది నా మీద ఎగురుతున్నది. ఇంతలోనే నా బెల్ట్‌లో ఉన్న 9ఎంఎం పిస్తోల్ పైకి ఎగిరింది. దాన్ని అది అందుకోబోయింది. ఇంతలోనే దాని కాలివేలు పిస్తోల్ ట్రిగ్గర్‌కు తగలడంతో బుల్లెట్ నా శరీరంలోకి దూసుకెళ్లిందని ఆయన వివరించారు. మరోవైపు నా కుక్క నన్ను కాల్చివేసింది.... అనే దాని గురించి నేను  ఎన్నడూ వినలేదనె వ్యాఖ్యానించారు పోలీసు చీఫ్ రోజర్ పోర్టర్.