ముంబయి ఆటగాళ్లకు సరికొత్త పనిష్‌మెంట్‌

ముంబయి ఆటగాళ్లకు సరికొత్త పనిష్‌మెంట్‌

నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా ముంబయి ఇండియన్స్ ఆటగాళ్లకు సరికొత్త పనిష్‌మెంట్‌ ఇచ్చారు జట్టు మేనేజ్‌మెంట్‌. ముంబయి ఆటగాళ్లు ఇషాన్‌ కిషన్‌, అంకుల్‌ రాయ్‌‌, రాహుల్‌ చాహార్‌లకు ఈ పనిష్‌మెంట్‌ ఇచ్చారు. ఇషాన్‌ కిషన్‌ జిమ్‌ సెషప్‌ కు బంక్ కొట్టాడు. అంకుల్‌ రాయ్‌ సరైన సమయానికి ఫిజియోకి రిపోర్టు చేయలేదు. ఇక రాహుల్‌.. ట్రాక్‌ సూట్స్‌ వేసుకుని బస్సులో ప్రయాణించాలని సూచిస్తే జీన్స్‌ వేసుకొన్నాడు. ఆయా కారణాలతో ఈ ముగ్గురు నిబంధనలు ఉల్లంఘించారు. దీంతో ఆగ్రహం చెందిన జట్టు యాజమాన్యం సరికొత్తగా అలోచించి వారికి శిక్ష విధించింది. శిక్షలో భాగంగా ఈ ముగ్గురు ఆటగాళ్లు ముంబయి నుంచి బెంగళూరు వచ్చే సమయంలో ప్రత్యేకంగా తయారు చేసిన జంప్ సూట్‌ వేసుకోవాలని సూచించింది. ఈ జంప్ సూట్‌ వేసుకుని ఎయిర్‌పోర్టుకు రాగానే సహా ఆటగాళ్లు, సిబ్బందితో పాటు ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. ఇక ముంబై కెప్టెన్ రోహిత్‌ శర్మ వీళ్లను చూసి ఏమైంది అని అడిగి నవ్వుకున్నాడు.