ఐపీఎల్ మ్యాచ్ లకు మలింగా దూరం... 

ఐపీఎల్ మ్యాచ్ లకు మలింగా దూరం... 

యూఏఈ వేదికగా జరగన్నున ఐపీఎల్ 2020 మొదటి మ్యాచ్ ల్లో ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ లసిత్ మలింగ ఆడే సూచనలు కనిపించడం లేదు. దానికి కారణం లంక ప్రీమియర్ లీగ్ (సీపీఎల్). అయితే మార్చి 29 న జరగాల్సిన ఐపీఎల్ కరోనా కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత భారత్ లో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఈ లీగ్ జరుగుతుందా... లేదా అనే అనుమానాలు అందరిలోనూ ఏర్పడాయి. ఇక కొన్ని రోజుల క్రితం ఐపీఎల్ సెప్టెంబరు 26 నుంచి నవంబరు 8 వరకూ జరుగుతుంది అని బీసీసీఐ తెలిపింది. ఈ  ప్రకటనతో ఆటగాళ్లకు ఇబ్బంది కలగకుండా ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 20 వరకూ సీపీఎల్ నిర్వహించనున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు షెడ్యూల్ ప్రకటించింది. కానీ మళ్ళీ తన షెడ్యూల్ లో మార్పులు చేస్తూ సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ జరుగుతుంది అని బీసీసీఐ తెలిపింది. దాంతో శ్రీలంక ఆటగాళ్లు సీపీఎల్ టోర్నీ ముగ్గించుకొని యూఏఈ కి వచ్చి అక్కడ 14 రోజుల క్వారంటైన్‌లో ఉన్న తర్వాతే ఐపీఎల్ ఆడగలరు. ఇక ఐపీఎల్ లో ఆడే శ్రీలంక ఆటగాళ్లలో మలింగ ముంబయి ఇండియన్స్ తరపున ఆడుతుండగా శ్రీలంకకి చెందిన ఆల్‌రౌండర్ ఇసురు ఉదానా మొదటిసారిగా ఐపీఎల్ లో ఆడబోతున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఈ ఆటగాడిని కొనుగోలు చేసింది.