అంబానీ ఆదాయం... గంటకు రూ.95 కోట్లు... 

అంబానీ ఆదాయం... గంటకు రూ.95 కోట్లు... 

కరోనా కాలంలో ప్రపంచ కుబేరుల ఆస్తులు క్రమంగా తగ్గిపోయాయి.  పరిశ్రమలు మూతపడటం, షేర్లు పడిపోవడంతో ఈ పరిస్థితి నెలకొన్నది.  ఇండియాలోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి.  కరోనా ప్రభావం ప్రపంచ సంపన్నులపై ఎలాంటి ప్రభావం చూపింది వారి ఆస్తులు ఎంతమేరకు కోల్పోయారు అనే విషయాలపై  చైనాకు చెందిన హురున్ సంస్థ ప్రత్యేక జాబితాను రిలీజ్ చేసింది.  

ఈ జాబితా ప్రకారం, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కరోనా నాలుగు నెలల కాలంలోని మొదటి రెండు  నెలల్లో 19 బిలియన్ల సంపదను కోల్పోయాడు.  అయితే, తరువాత రెండు నెలల కాలంలోనే పోగొటున్న 19 బిలియన్ డాలర్లను తిరిగి సంపాదించుకున్నాడు.  రెండు నెలల కాలంలో ముఖేష్ అంబానీ 18 బిలియన్ డాలర్లు సంపాదించారు.  ఇండియా లెక్కల ప్రకారం రూ.1.7 లక్షల కోట్లు అన్నమాట.  డిజిటల్ రంగంలో తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాల వలన ముఖేష్ అంబానీ ఈ సంపదను ఆర్జించాడు.  రెండు నెలల కాలంలో అయన గంటకు రూ.95 కోట్ల రూపాయల చొప్పున సంపాదించాడు.  ప్రపంచ 100 బిలినియర్ల జాబితాలో ముఖేష్ అంబానీ  8 వ స్థానంలో ఉండటం విశేషం.