ఏపీ బీజేపీ కొత్త చీఫ్‌తో ముద్రగడ చర్చలు

ఏపీ బీజేపీ కొత్త చీఫ్‌తో ముద్రగడ చర్చలు

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను నియమిస్తూ పార్టీ జాతీయ చీఫ్ అమిత్‌షా ప్రకటిన చేశారు. అనంతరం కన్నా లక్ష్మీనారాయణతో సమావేశమయ్యారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మానాభం... కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి బీజేపీ ఏపీ చీఫ్ కావడంతో... ముద్రగడ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ముద్రగడ... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కన్నాకు అభినందనలు చెప్పినట్టు తెలిపారు. కాపు రిజర్వేషన్లపై ఏపీ సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధిలేదని ఆరోపించిన ముద్రగడ... కాపులకు ఏదో చేశానంటూ కేంద్రానికి నివేదిక పంపారని విమర్శించారు. వాస్తవాలు కేంద్రానికి నివేదించి ఉంటే ఇప్పటికే రిజర్వేషన్లు వచ్చేవన్న కాపు ఉద్యమనేత... తమ రిజర్వేషన్లకు సహకరించాలని కేంద్రాన్ని కూడా కోరామన్నారు.