జగన్‌కు కాపు నేత ముద్రగడ లేఖ

జగన్‌కు కాపు నేత ముద్రగడ లేఖ

కాపు సమస్యలు తీర్చాలి, కాపు రిజర్వేషన్లను అమలు చేయాలని కోరుతూ ముద్రగడ పద్మనాభం ఏపీ సీఎం జగన్ కు లేఖ రాశారు. నవీన్ పట్నాయక్, జ్యోతి బసు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాగే పూజలందుకోవాలని గానీ, పదవిని మూణ్ణాళ్ల ముచ్చట చేసుకోవద్దని లేఖలో కోరారు. ప్రధాని మోడీతో మాట్లాడి కాపు రిజర్వేషన్లపై తేల్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మీరు అడిగిన వారికి, అడగని వారికి దానాలు చేసి దానకర్ణుడు అనిపించుకుంటున్నారని, రిజర్వేషన్ల సమస్యను కూడా తీర్చమని అభ్యర్థించారు. గతంలో కాపు రిజర్వేషన్ల పోరాటానికి మద్దతు ఇచ్చిన విషయాన్ని ముద్రగడ పద్మనాభం గుర్తు చేశారు. మీ విజయంలో మా జాతి పాత్ర ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.