షేన్ వాట్సన్‌కు 'కొత్త పేరు'

షేన్ వాట్సన్‌కు 'కొత్త పేరు'

ఆదివారం వాంఖడే స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో చెన్నై గెలిచి ఐపీఎల్-11 టైటిల్ విన్నర్‌గా నిలిచింది. ఈ మ్యాచ్ లో చెన్నై ఓపెనర్ షేన్ వాట్సన్ ఒంటిచేత్తో చెలరేగి కప్పును చెన్నై సొంతం చేసాడు. మొదటి పది బంతులను ఎదుర్కొని పరుగులేమి చేయని వాట్సన్.. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 57 బంతుల్లో 11x4, 6x8లతో 117 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మ్యాచ్ ముగిసిన వెంటనే చెన్నై కెప్టెన్ ధోనీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఓ ఫొటో వైరల్ అయింది. కుమార్తె చిన్నారి జీవాను ఎత్తుకుని.. భార్య సాక్షితో కలిసి ఐపీఎల్-11 ట్రోఫీని పట్టుకుని దిగిన ఫొటోను పోస్ట్ చేసాడు ధోని. 'ముంబై మొత్తం పసుపు రంగుతో నిండిపోయింది. షేన్ 'షాకింగ్' వాట్సన్.. షాకింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. చెన్నై జట్టుకి మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు. సీజన్‌ను గొప్పగా  ముగించాం. ఈ ట్రోఫీ గురించి జీవా పట్టించుకోకుండా.. ముద్దుమాటలు చెబుతూ లాన్‌లో పరిగెత్తాలని ఉవ్విళ్లూరుతోంది' అని టాగ్ చేసాడు. ఈ టాగ్ లో చెన్నై జట్టును గెలిపించి ట్రోఫీ అందించిన వాట్సన్‌కు.. షేన్ 'షాకింగ్' వాట్సన్ అంటూ కొత్త పేరు తగిలించాడు ధోని.