సాయం సొమ్మును సినిమాలకు వాడేశారు!

సాయం సొమ్మును సినిమాలకు వాడేశారు!

పోషకాహార లోపంతో బాధపడుతున్న చైనా పిల్లల కోసం ఇంగ్లండ్‌ విరాళాలు అందజేస్తే.. ఆ సొమ్మును సినీ పరిశ్రమ అభివృద్ధికి ఉపయోగించడంపై అక్కడి ఎంపీలు భగ్గుముంటున్నారు. వివిధ దేశాల్లో పేదరిక నిర్మూలనకు ఏటా ఇంగ్లండ్‌ ఆర్థిక సహాయం చేస్తుంటుంది. ఇందులో భాగంగా కొన్నేళ్ల నుంచి చైనాకు కూడా విరాళాలు పంపిస్తోంది. కానీ ఈ విరాళాలను సినీ పరిశ్రమ అభివృద్ధికి, మ్యూజియమ్‌ల అభివృద్ధికి వెచ్చిస్తున్నట్టు తాజాగా ఓ నివేదిక బయటపెట్టింది. సహాయ నిధులను సినిమాలకు ఉపయోగించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయమై అక్కడి ప్రభుత్వాన్ని పార్లమెంట్‌ సభ్యులు నిలదీశారు. సహాయ నిధుల అర్ధాన్నే మార్చేసేలా వ్యవహరించడం సరికాదని అసంతృప్తి వ్యక్తం చేశారు.