సైబర్‌ క్రైమ్‌లో సాయిరెడ్డి ఫిర్యాదు.. ఫేక్‌ గ్యాంగ్‌కు వార్నింగ్..!

సైబర్‌ క్రైమ్‌లో సాయిరెడ్డి ఫిర్యాదు.. ఫేక్‌ గ్యాంగ్‌కు వార్నింగ్..!

సోషల్ మీడియాలో తన ఫేక్ అకౌంట్లపై ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి... ఈ వ్యవహారంపై ఏపీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు విజయసాయి.. సైబర్ క్రైమ్ చట్టం కింద వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరించారని మండిపడ్డ సాయిరెడ్డి... సైబర్ క్రైమ్ నుంచి నిందితులు ఎవరూ తప్పించుకోలేరన్నారు. కాగా, ఇటీవల కాలంలో ఏపీలో అధికార, ప్రతిపక్షం మధ్య సోషల్ మీడియాలో విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి... ముఖ్యంగా వైసీపీలో కీలకంగా ఉన్న విజయసాయిరెడ్డి పేరుతో ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేసి.. పోస్టులు పెడుతున్నారు.. దీనిని సీరియస్‌గా తీసుకున్న విజయసాయిరెడ్డి.. ఏపీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు.. ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్నవారిని కూడా వదలొద్దని ఫిర్యాదు చేశారు. ఇక, ఫేక్ గ్యాంగ్‌ మొత్తాన్ని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం అవుతుందన్న సాయిరెడ్డి.. సైబర్ క్రైమ్ చట్టం కింద వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు.