నాలుగు రోజుల ముందుగానే..

నాలుగు రోజుల ముందుగానే..

ఎండలు, ఉక్కపోతలు, ఇసుక తుఫాన్లతో తల్లాడిల్లిపోతున్న దేశప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. నిర్దేశిత సాధారణ సమయం కంటే నాలుగు రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రాన్ని తాకనున్నట్లు ప్రైవేటు వాతావరణ అంచనాల సంస్థ స్కైమెట్ ప్రకటించింది. ఈ నెల 28న నైరుతి రుతుపవనాలు కేరళ తాకుతాయని.. ఈ నెల 20న అండమాన్ నికోబార్ దీవులను తాకనున్న రుతుపవనాలు.. మే 24న తూర్పు మధ్య బంగాళాఖాతానికి చేరుకుంటాయని తెలిపింది. సాధారణంగా ప్రతి ఏటా జూన్ 1కి రుతుపవనాలు కేరళను తాకుతాయి.. అలాంటిది ఈ సారి మాత్రం నాలుగు రోజుల ముందుగానే వస్తున్నాయి.