అప్పు తీర్చలేదని వివాహితపై అత్యాచారం...సహకరించిన భర్త, అత్తమామలు

అప్పు తీర్చలేదని వివాహితపై అత్యాచారం...సహకరించిన భర్త, అత్తమామలు

ఒకవైపు కరోనా వైరస్ కోరలు చాస్తుంటే కోల్‌కత్తాలో దారుణ సంఘ‌ట‌న చోటు చేసుకుంది...జల్సాలకు బానిసలైన దుర్మార్గులు తీసుకున్న అప్పు స‌కాలంలో తీర్చ‌లేక తమ భార్యలని ఓ వ్యక్తికి తాకట్టు పెట్టేశారు...ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన వారికి జీవితం నరకంగా మారింది. ఇంటి అప్పుతీర్చేందుకు ఆ ఇద్దరు మహిళలను వారి భర్తలు.. తమకు అప్పు కోసం తాకట్టు పెట్టేశారు. ఇక అప్పు ఇచ్చిన వ్యక్తికి కావాల్సినప్పుడల్లా..ఈ ఇద్దరు మహిళలు అతని పడక సుఖం తీర్చేలా వారి భర్తలు ఒప్పందం కుదుర్చుకున్నారు...
ఆ వ్యక్తి మహిళలనును వేరే ఓ ప్రాంతానికి తీసుకువెళ్లి బలవంతంగా అత్యాచారం చేశాడు...ఇదేమిటని నిలదీయగా.. తమ భర్తలే అప్పు తీర్చడం కొసం తనఖా పెట్టినట్లు తెలుసుకొని షాక్ అయ్యారు...ఇంటికి వెళ్లి భర్త, అత్తమామలను వారు నిలదీయగా పుట్టింటికి వెళ్లి ఇద్దరూ చెరో రూ.5లక్షలు తేవాలని లేకపోతే అప్పు ఇచ్చిన వారితో శృంగారం చేయాల్సిందేనని తేల్చిచెప్పేశారు...ఎన్నో ఆశలతో కొత్త జీవితాలను ప్రారంభించవల్సిన ఆ మహిళలు అప్పు ఇచ్చిన వాడి కామానికి బలయ్యారు...