గాల్వన్ లోయ వివాదం పైన సినిమా ... హీరో ఎవరంటే

గాల్వన్ లోయ వివాదం పైన సినిమా ... హీరో ఎవరంటే

ఇండియా చైనా దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. జూన్ మొదటి వారం నుంచి రెండు దేశాల మధ్య గొడవలు తారాస్థాయిలో జరుగుతున్నాయి. గాల్వన్ లోయ ఉదంతం తరువాత ఇండియా బోర్డర్ లో చైనా తన సైన్యాన్ని పెంచింది. అంతేకాదు, డ్రాగన్ దేశానికి చెందిన ఎయిర్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగింది. ఇదంతా చూస్తుంటే  యుద్ధం అనివార్యంగా కనిపిస్తుంది గాల్వన్ లోయలో భారత సైన్యంతో చైనా సైన్యం(పీ.ఎల్.ఏ) ఘర్షణ పడిన ఘటన మొత్తం భారత దేశాన్ని ఏకతాటి పైకి తెచ్చింది. ప్రముఖ మలయాళ నటుడు-దర్శకుడు మేజర్ రవి భారత-చైనా సరిహద్దు వివాదంపై `బ్రిడ్జ్ ఆఫ్ గాల్వన్` పేరుతో ఒక చిత్రాన్ని తాజాగా ప్రకటించారు. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించనున్నారు. రెగ్యులర్ షూట్ వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలవుతుంది.మేజర్ రవి దేశభక్తి సినిమాల్ని తెరకెక్కించడంలో దిట్ట. కాగా ఇటీవల పాక్ తీవ్రవాదంపై వార్ నేపథ్యంలో విక్కీ కౌశల్ హీరోగా `ఊరి` అనేసినిమా  సంచలన విజయం అందుకున్న విషయం తెలిసిందే .. అదే విధంగా ఈ సినిమా కూడా ఉద్వేగభరితంగా తెరకెక్కిస్తారా? అన్నది చూడాలి.