వైఎస్ జయంతి : మోహన్ బాబు ఎమోషనల్ పోస్ట్

వైఎస్ జయంతి : మోహన్ బాబు ఎమోషనల్ పోస్ట్

దివంగత మాజీ ముఖ‍్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 71వ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో నటుడు మోహన్ బాబు ట్విట్టర వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసారు. 'స్నేహశీలీ, రాజకీయ దురంధరుడు, మాట తప్పలేరు మానధనులు అన్న పోతన మాటకు నిలువెత్తు నిదర్శనం, పేద ప్రజల దైవం మా బావగారైన వైఎస్. రాజశేఖరరెడ్డి గారి పుట్టినరోజు నేడు. బావగారు ఏ లోకంలో ఉన్నా ఆయనకు ఆత్మ శాంతి కలగాలని, ఆయన దీవెనలు మా కుటుంబానికి, తెలుగు ప్రజలకి ఉండాలని కోరుకుంటున్నాను' అని ట్వీట్ చేసారు. 1995 నుండి 2001 వరకు రాజ్య సభ సభ్యునిగా చేసిన మోహన్ బాబు ప్రస్తుతం వైసీపీ పార్టీలో ఉన్నారు.