మోడీ, బీజేపీ వ్యూహం బోల్తాకొట్టింది...

మోడీ, బీజేపీ వ్యూహం బోల్తాకొట్టింది...

కర్ణాటకలో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ వ్యూహం బోల్తాకొట్టిందన్నారు తెలంగాణ శాసనమండలి పక్ష నేత షబ్బీర్ అలీ... అప్రజాస్వామిక చర్యలను అడ్డుకుని మోడీ నియంత పాలనను తిప్పికొట్టడంతో ఏఐసీసీ, కర్ణాటక కాంగ్రెస్ విజయవంతం అయ్యారని పేర్కొన్నారు. దక్షిణ భారత దేశంలో అడుగుపెట్టాలన్న మోడీ ఆశలను ప్రజలు తిప్పికొట్టారంటూ ఓ ప్రకటన విడుదల చేశారు షబ్బీర్ అలీ. ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యాంగ విరుద్ధంగా, అప్రజాస్వామ్యంగా గద్దెను ఎక్కించేందుకు ప్రయత్నం చేశారని... కర్ణాటక వ్యవహారం మోడీ రాజకీయ జీవితానికీ మచ్చగా మిగిలిపోతుందని పేర్కొన్నారు. కర్ణాటక గవర్నర్ ఓ ఆర్ఎస్ఎస్ వాదిగా, మోడీ ఏజెంట్ గా పనిచేశారని ఆరోపించిన ఆయన... యడ్యూరప్ప వారం రోజులు సమయం అడిగితే 15 రోజులు సమయం ఇచ్చి ఎమ్యెల్యేలు కొనుక్కోమని ఆఫర్ ఇచ్చినట్టు చేశారని విమర్శించారు. ఎట్టకేలకు కర్ణాటకలో ప్రజలు గెలిచారు... కాంగ్రెస్, జేడీఎస్ నాయకులకు, ఎమ్యెల్యేలకు అభినందనలు తెలిపారు షబ్బీర్ అలీ.