లారా నా బౌలింగ్‌ కు భయపడ్డాడు అంటున్న పాక్ బౌలర్...

లారా నా బౌలింగ్‌ కు భయపడ్డాడు అంటున్న పాక్ బౌలర్...

పాకిస్తాన్ ఆల్ రౌండర్ మొహమ్మద్ హఫీజ్ బౌలింగ్ కంటే అతని బ్యాటింగ్ గురించి ఎక్కువ తెలుసు, కాని లెజండరీ వెస్ట్ ఇండియన్ బ్యాట్స్మాన్ బ్రియాన్ లారాతో సహా లెఫ్ట్ హ్యాండర్లు తన ఆఫ్ స్పిన్ను ఎదుర్కోవడానికి భయపడ్డారని ఆయన వెల్లడించారు. తన కెరీర్‌ను గౌరవంగా ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్న 39 ఏళ్ల, వన్డేలు టెస్ట్ ఫార్మాట్లలో కలిపి 10,000 పరుగులు సాధించాడు. అయితే ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ బౌలర్లను ఎదుర్కొన బ్రియాన్ లారా, తన బౌలింగ్ కు వ్యతిరేకంగా బ్యాటింగ్ చేయడం చాల కష్టం అని ఒప్పుకున్నాడు అని తెలిపాడు. అయితే నేను తదుపరి టి 20 ప్రపంచ కప్ ఆడిన తరువాత అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ కావాలనుకుంటున్నాను అని తెలిపాడు.

మా ప్రత్యర్ధులు నన్ను ఎదుర్కోవడంలో ఎప్పుడూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అయినప్పటికీ, నేను కుడిచేతి వాళ్లకు కూడా బాగా బౌలింగ్ చేశాను. మీరు నా ఎకానమీ రేటును పరిశీలిస్తే, అది రెండింటికీ సమానం అని హఫీజ్ అన్నారు. “నా కెరీర్‌లో నా బౌలింగ్ నాకు చాలా తోడ్పడింది. నేను ఏదో ఒక మ్యాచ్‌లో బ్యాట్‌తో ప్రదర్శన ఇవ్వలేకపోతే, నా బౌలింగ్‌తో నేను దాన్ని తీర్చగలిగాను. నేను క్రికెట్ ఆడుతున్నంత వరకు, లెఫ్ట్ హ్యాండర్స్‌కు వ్యతిరేకంగా నా విజయాన్ని కొనసాగించాలనుకుంటున్నాను, ”అని హఫీజ్ తెలిపారు. హఫీజ్ తన 55 మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్‌లో 53 వికెట్లు పడగొట్టగా, వన్డే ఫార్మాట్‌లో హఫీజ్ 218 మ్యాచ్‌ల్లో 139 వికెట్లు పడగొట్టాడు.