జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోడీ..అందుకేనా ?

జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోడీ..అందుకేనా ?

నేడు సాయంత్రం 4 గంటలకు జాతినుద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. ఒక వైపు కరోనా కట్టడి, మరో వైపు ఆర్ధిక ప్రగతి ఈ రెండింటి ఆవశ్యకతలను దేశ ప్రజలకు ప్రధాని వివరించే అవకాశం ఉందని అంటున్నారు. లాక్ డౌన్ ను పొడిగించాలని నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను దేశ ప్రజలకు వివరించనున్నారు ప్రధాని. పెరుగుతున్న కరోనా కేసుల పై ప్రజలలో నెలకొన్న భయాందోళనలపై భరోసా ఇవ్వనున్నారు మోడీ.

ఇక అన్‌లాక్‌-2 కు సంబంధించి కూడా నిన్న రాత్రి ఇప్పటికే కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. కంటైన్మెంట్ జోన్ల‌లో జూలై 31 వ‌ర‌కు లాక్‌డౌన్ కొన‌సాగుతుంద‌ని, దేశంలోని స్కూళ్లు, కాలేజీలు, జిమ్‌లు, థియేటర్లు కూడా జూలై 31 వ‌ర‌కు మూసే ఉంటాయని హోంశాఖ మార్గద‌ర్శకాల్లో పేర్కొన్నారు. ఇక గ‌ల్వాన్‌ లోయ‌లో భార‌త్‌-చైనా దేశాల మ‌ధ్య ఘ‌ర్షణ‌లు, త‌ద‌నంత‌ర ప‌రిణామాల‌ను కూడా ప్రధాని త‌న‌ ప్రసంగంలో ప్రస్తావించే అవ‌కాశముంది.