విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై జాతీయ విపత్తు నివారణ శాఖతో మోడీ సమావేశం... 

విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై జాతీయ విపత్తు నివారణ శాఖతో మోడీ సమావేశం... 

విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి స్టీరిన్ గ్యాస్ లీకైన సంగతి తెలిసిందే. దాదాపుగా 5వేల మెట్రిక్ టన్నుల గ్యాస్ లీకైనట్టుగా సమాచారం.  ఈ స్థాయిలో గ్యాస్ లీక్ కావడం అంటే మాములు విషయం కాదు.  వేలాది మందిపై ఇది ప్రభావం చూపించింది.  ఉదయం 3 గంటలకు ఈ గ్యాస్ లీక్ కావడంతో ఆ వాయువులను పీల్చుకొని వేలాది మంది స్పృహ కోల్పోయారు.  ఈ దుర్ఘటన జరగడంతో దీనిపై ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.  

బాధితులకు ప్రభుత్వం సహాయక చర్యలు అందిస్తోంది.  దీనిపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.  అలానే ప్రధాని మోడీ ఈ విషయపై జగన్ కు ఫోన్ చేసి ప్రమాదానికి సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు.  దీనిపై మోడీ జాతీయ విపత్తు నిర్వాహణ శాఖాధికారులతో మోడీ సమావేశం కాబోతున్నారు.  అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ప్రధాని మోడీ అధికారులను ఆదేశించారు.