బెంగళూరు చేరుకున్న ఎమ్మెల్యేలు

బెంగళూరు చేరుకున్న ఎమ్మెల్యేలు

కర్ణాటక రాజకీయం క్లైమాక్స్‌కు చేరుకుంది. ఇవాళ సాయంత్రం అసెంబ్లీ బలపరీక్ష జరగనున్నది. నిన్నటి వరకు హైదరాబాద్‌లో ఉన్న కాంగ్రెస్‌,  జేడీఎస్‌ ఎమ్మెల్యేలు ఇవాళ ఉదయం బెంగళూరు చేరుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి ప్రత్యేక బస్సుల్లో హైదరాబాద్‌ నుంచి ఈ ఎమ్మెల్యేల బృందం బయలుదేరింది. మొత్తం 3 బస్సులో ఎమ్మెల్యేలను తరలించారు.  కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలతోపాటు తెలంగాణ ప్రాంత నేతలు కూడా వెళ్లారు. ఎమ్మెల్యేలకు బెంగళూరులో కర్ణాటక పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. ఇక.. ఈరోజు ఉదయం 11 గంటలకు కర్ణాటక అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభమవుతుంది. ముందుగా ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్‌  ప్రమాణ స్వీకారం చేయిస్తారు.