టీఎంయూతో ముగిసిన చర్చలు

టీఎంయూతో ముగిసిన చర్చలు

ఆర్టీసీ గుర్తింపు సంఘం టీఎంయూతో జరిగిన చర్చలు ముగిసాయి. సమ్మెకు పిలుపునిచ్చిన ఆర్టీసీ కార్మిక సంఘాలతో తెలంగాణ మంత్రుల కమిటీ మరోసారి చర్చలు జరిపింది. ఆర్టీసీ గుర్తింపు సంఘం టీఎంయూ నేతలతో మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, కేటీఆర్, మహేందర్ రెడ్డిలు ఈరోజు సమావేశమయ్యారు. నిన్న మంత్రివర్గ ఉపసంఘంతో జరిపిన చర్చలు ఎలాంటి ఫలితాలను ఇవ్వనందున ఈరోజు మరోమారు సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశం అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్ వద్దకు బయలుదేరారు మంత్రులు. ఈ సమావేశంలో తమ డిమాండులు పరిష్కరించకుంటే సమ్మెకు వెళ్లాలని కార్మికులు నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మంత్రుల భేటీ అనంతరం సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.