నాకు క‌రోనా వ‌స్తే గాంధీ ఆస్ప‌త్రికే.. మంత్రి త‌ల‌సాని

నాకు క‌రోనా వ‌స్తే గాంధీ ఆస్ప‌త్రికే.. మంత్రి త‌ల‌సాని

నాకు క‌రోనావైర‌స్ వ‌స్తే మాత్రం గాంధీ ఆస్ప‌త్రిలోనే చేరి చికిత్స చేయించుకుంటాను అన్నారు తెలంగాణ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్.. మీడియా ప్ర‌తినిధుల‌తో ఆయన మాట్లాడుతూ.. కరోనా నియంత్రణకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోంద‌న్నారు.. తనకు కరోనా వస్తే కార్పొరేట్‌ ఆస్పత్రులకు వెళ్లనని, గాంధీ ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకుంటానని స్ప‌ష్టం చేశారు.. ఇక‌, త‌న నియోజ‌క‌వ‌ర్గం స‌న‌త్‌న‌గ‌ర్‌లో జ‌రుగుతోన్న అభివృద్ది కార్య‌క్ర‌మాల‌ను వెల్ల‌డించారు మంత్రి త‌ల‌సాని.. కాగా, ఎవ్వ‌రికి క‌రోనా వ‌చ్చినా గాంధీలోనే చికిత్స అందిస్తామ‌ని అప్ప‌ట్లో సీఎం కేసీఆర్ వెల్ల‌డించినా.. ఆ త‌ర్వాత అధికార పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులు ప్రైవేట్ ఆస్ప‌త్రుల్లో చేర‌డంపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.. మ‌రోవైపు.. కేసులు కూడా క్ర‌మంగా పెరిగిపోవ‌డంతో.. ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌కు కూడా అనుమ‌తి ఇచ్చిన తెలంగాణ స‌ర్కార్‌.. ఫీజుల విధానాన్ని కూడా ఖ‌రారు చేసిన విష‌యం తెలిసిందే.