జీఎస్టీ కూడా ఎం.ఆర్.పిలో కలిసే రావాలి.. 

జీఎస్టీ కూడా ఎం.ఆర్.పిలో కలిసే రావాలి.. 

వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై కన్స్యూమర్ ప్రొటక్షన్ కౌన్సిల్‌లో చర్చించామని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఈరోజు అమరావతిలో ఆరేళ్ల తర్వాత ఈ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించామని.. 15 డిపార్ట్మెంట్ లు ఈ కౌన్సిల్ మీటింగ్ లో పాల్గొన్నాయని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్ కాలేజీల్లో 25 శాతం ఫ్రీ ఎడ్యుకేషన్ పేద విద్యార్థులకు ఇవ్వాలని కోరారు. ఈ చట్టం ఉన్నా.. ప్రభుత్వం అమలు చేయడం లేదనే విషయాన్ని సమావేశంలో ప్రస్తావించారు. విద్యా సంస్థల్లో కూడా పేరంట్స్ కమిటీ ఉండాలని.. ఈ కమిటీలు ఎక్కడా లేవని ఆయన తెలిపారు. అక్షయపాత్ర ఉన్న కొన్ని ప్రాంతాలలో మిడ్ డే మిల్స్ లో ఎగ్ తీసేశారని ఆయన వివరించారు.

జనరిక్ షాపులో మెడిసిన్ తీసుకొని వెళ్ళి గ్రామాల్లో నార్మల్ రేట్స్ కు అమ్ముతున్నారని.. మన దేశంలో ఎమ్.ఆర్.పీని ఇష్టం వచ్చినట్లు పెట్టుకొనే దౌర్బగ్య పరిస్థితి ఉందని ఆయన వెల్లడించారు. అన్నింటిపై ప్రభుత్వాలు కఠినంగా చర్యలు తీసుకోవాలని చర్చించినట్లు తెలిపారు. సినిమా హల్స్ లో జరిగే దోపిడీలపై జిల్లాలోని జేసీలు దృష్టి పెట్టాలని.. కౌన్సిల్ మెంబర్స్ ను కూడా ప్రోత్సాహించాలని నిర్ణయించినట్లు వివరించారు. అలాగే డిసెంబరులో వీరు రాష్ట్రంలో ఉండే సమస్యలపై భాగా దృష్టి పెడుతున్నారని.. వీరికి డిసెంబర్ లో అవార్డులు అందించి మరింత ప్రోత్సాహం కలిగించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.  ఎమ్.ఆర్.పి ప్లస్ జీఎస్టీ వసూలు చేస్తున్నారని.. మాములుగా జీఎస్టీ కూడా ఎమ్.ఆర్.పిలో కలిపి రావాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రతిపాటి పుల్లారావు వివరించారు.