కరోనాపై కేటీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. ఈసారి ఇలా..!

కరోనాపై కేటీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. ఈసారి ఇలా..!

రోజుకు రోజుకీ క‌రోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి.. ఒక‌టి ప్రారంభంమై.. ప‌దుల సంఖ్య‌,, వంద‌ల సంఖ్య‌లో.. వేల సంఖ్య‌లో.. ఇప్పుడు ఏకంగా 2 వేల‌కు పైగా కేసులు న‌మోదు అవుతున్నాయి.. అయితే.. క‌రోనా వైర‌స్‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు మంత్రి కేటీఆర్.. తెలంగాణ భవన్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శులతో స‌మావేశ‌మైన టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. కరోనా ఇప్పట్లో పోయేలా లేదు.. ఇంకా కొన్ని నెలల పాటు ఉండే అవకాశం ఉంద‌న్నారు. ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాల‌ని సూచించిన ఆయ‌న‌.. ఎక్కడ ఎలాంటి కొరత ఉన్నా వెంటనే స్పందించాల‌ని ఆదేశించారు. ఇక‌, ప్లాస్మా దాతలపై కూడా ఫోకస్ పెట్టాల‌ని.. వారిని ప్రోత్సహించాల‌ని సూచించారు కేటీఆర్. 

మ‌రోవైపు జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణంపై రివ్యూ నిర్వ‌హించిన కేటీఆర్.. ఆగస్ట్ 15 లోపు కొన్ని పార్టీ కార్యాలయాలు ప్రారంభం చేసుకునేందుకు సిద్దం చేయాలని ఆదేశించారు.. సీఎం కేసీఆర్ ఆ కార్యాల‌యాల‌ను ప్రారంభిస్తారు అని వెల్ల‌డించారు.. ప్ర‌తిప‌క్షాల ఆరోప‌ణ‌లకు కౌంట‌ర్ ఇవ్వాల‌ని.. జిల్లా స్థాయిలో.. రాష్ట్ర స్థాయిలో తిప్పికొట్టాల‌ని పిలుపునిచ్చారు. అయితే, కాంగ్రెస్ విమర్శలకు కౌంట‌ర్ ఇస్తూనే.. బీజేపీని లైట్ తీసుకోండి అని వ్యాఖ్యానించారు టీఆర్ఎస్ వ‌ర్కిగ్ ప్రెసిడెంట్.