మాది చిల్లర బుద్ది కాదు...

మాది చిల్లర బుద్ది కాదు...

ఎన్నికల కోసం 'రైతు బంధు' పథకాన్ని తీసుకొచ్చేంత చిల్లర బుద్ది మాది కాదన్నారు మంత్రి కేటీఆర్... కోనరావుపేటలో రైతు బంధు పథకం కింద రైతులకు చెక్కులు, పట్టాదార్ పాస్ పుస్తకాలను అందజేసిన మంత్రి... ఈ సందర్భంగా మాట్లాడుతూ విపోఆల విమర్శలపై ఘాటుగా స్పందించారు. ఎన్నికల కోసమే 'రైతు బంధు' పథకమన్న విమర్శలపై స్పందించిన కేటీఆర్... ఏడాది క్రితం పథకాన్ని ప్రకటించి అమలు చేస్తున్నాం... మరి ఈ పథకం కంటే ముందు వచ్చిన ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఏమైనా పొడిశాయా అంటూ కౌంటర్ ఇచ్చారాయన. రైతు కష్టం తెలిసిన వ్యక్తి కేసీఆర్... అందుకే రైతుల సంక్షేమం కోసం ఆలోచిస్తున్నారన్న కేటీఆర్... దేశవ్యాప్తంగా రైతుబంధు పథకం అమలు చేయాలన్నదే కేసీఆర్ ఆలోచన అన్నారు.

 వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను ఇస్తున్నాం. సమయానికి ఎరువులు, విత్తనాలు సరఫరా చేస్తున్నాం. వ్యవసాయం దండగ కాదు... పండుగలా మారుస్తున్న నేత కేసీఆర్ అంటూ ప్రశంసలు గుప్పించిన ఆయన... ఏ ఎన్నికలు వచ్చిన కేసీఆర్ పాలన నచ్చే ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తున్నారని తెలిపారు. పంట సాయం ప్రకటించినప్పుడే పంపిణీ చేసేవాళ్లమే కానీ, రికార్డుల్లో ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని... అవి ప్రక్షాళన చేసిన తర్వాతే 'రైతు బంధు' పథకాన్ని ప్రారంభించినట్టు వెల్లడించారు కేటీఆర్.