బ‌ర్త్ డే స్పెష‌ల్‌: జ‌న‌హృద‌య‌నేత రామ‌న్న...

బ‌ర్త్ డే స్పెష‌ల్‌: జ‌న‌హృద‌య‌నేత రామ‌న్న...

ఎంతో మంది నేత‌లు ఉంటారు.. కానీ, జ‌నం హృద‌యాల్లో నిలిచిపోయేవాళ్లు కొంద‌రే ఉంటారు.. వాళ్లు చేసిన ప‌నులే.. కీర్తి తెచ్చి పెడ‌తాయి... ఆప‌ద‌లో ఉన్నాను అన్నా అంటే... నేను ఉన్నాను అంటూ చేయి అందించే నేత‌లు కొంద‌రే.. అలాంటివారిలో ముందువ‌రుస‌లో ఉంటారు తెలంగాణ యంగ్ అండ్ డైన‌మిక్ లీడ‌ర్, మంత్రి  కల్వకుంట్ల రామారారావు.. ప్రేమ‌గా పిలుచుకునే పేరు రామ‌న్న‌.. ట్విట్ట‌ర్‌లో ఓ మెసేజ్ పెడితే స్పందించిన సంద‌ర్భాలు ఎన్నో.. క‌ష్టం వ‌చ్చింది అన్నా అంటూ స‌మాచారం ఇస్తే... ఎంద‌రికో ఆపన్న హస్తం అందించిన నేత ఆయ‌న‌.. జ‌నం మొచ్చిన జ‌న హృద‌య నేత‌కు పుట్టిన రోజు సంద‌ర్భంగా ఇవే శుభాకాంక్ష‌లు.

ఉద్య‌మంలోనే కాదు... పాల‌న‌లోనూ త‌నదైన ముద్ర‌.. ఉద్యోగంలోనే కాదు.. ప్ర‌భుత్వంలోనే త‌న ప్ర‌త్యేక‌త చాటుకున్నారు కేటీఆర్... తెలంగాణ మ‌లిద‌శ ఉద్య‌మ ర‌థ‌సార‌థి కేసీఆర్ వారసత్వాన్ని అందిపుచ్చుకుని తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క భూమిక పోషించారు.. ఉన్న‌త చ‌దువులు చ‌ద‌వి.. విదేశాల్లో మంచి ఉద్యోగంలో ఉన్న ఆయ‌న‌... త‌న ప్రాంతంలో జ‌రుగుతోన్న ఉద్య‌మంలో భాగ‌స్వామి కావ‌డానికి.. విదేశాల‌కు వ‌ద‌లి స్వ‌దేశంలో అడుపెట్టాడు.. పుట్టిన‌గ‌డ్డ ప‌డుతోన్న గోస చూసి.. నేను సైతం అంటూ తెలంగాణ ఉద్య‌మంలో భాగ‌స్వామి అయ్యారు.. 2008లో తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు…. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు… తొలిసారి సిరిసిల్ల నియోజకవర్గం నుండి 2009లో పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెట్టిన ఆయ‌న‌.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భ‌వించిన త‌ర్వాత తొలిసారి 2014లో ఎన్నికలు జరుగగా మరోసారి అదే సెగ్మెంట్ నుంచి పోటీ చేసి గెలిచారు… తన తండ్రి కేబినెట్ లో సమాచార సాంకేతిక (ఐటీ), మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, టెక్స్టైల్స్, ఎన్నారై అఫైర్స్ మంత్రిగా విధులు నిర్వహించారు. ఇక‌, తెలంగాణ అసెంబ్లీ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో మ‌రోసారి తిరుగులేని విజ‌యం సాధించారు.. ఆ త‌ర్వాత టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా కీల‌క బాధ్య‌త‌లు బుజాన వేసుకున్నారు.. ఎన్నిక‌లు ఏవైనా కేటీఆర్ ఉండాల్సిందే... అవి సార్వ‌త్రిక ఎన్నిక‌లు అయినా.. ఉప ఎన్నిక‌లు అయినా.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లైనా.. రామ‌న్న ఒక‌సారి వ‌స్తే... ప‌రిస్థితి మొత్తం మారిపోతుంది అనేది అభ్య‌ర్థుల న‌మ్మ‌కం.. ఎన్నిక‌ల ఫ‌లితాలు కూడా ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేశాయి..

1976, జూలై 24న కేసీఆర్‌, శోభ దంపతులకు సిద్ధిపేటలో జ‌న్మించిన కేటీఆర్.. రెండేళ్లపాటు కరీంనగర్ లో చ‌దువుకున్నారు.. ఆ త‌ర్వాత హైదరాబాద్‌లో పాఠశాల విద్యను పూర్తిచేశారు.1990-91 ఎస్‌ఎస్‌సీ, జీజీ స్కూల్‌ లో పూర్తి చేశారు… 1991-93 ఇంటర్‌, విజ్ఞాన్‌ కాలేజీ గుంటూరులో పూర్తి చేశారు… గుంటూరులోని విజ్ఞాన్‌లో ఇంటర్మీడియట్‌ పూర్తిచేసి హైదరాబాద్‌ వచ్చి మెడిసిన్‌ ఎంట్రెన్స్‌ రాసిన రామారావుకు కర్ణాటకలోని ఓ మెడికల్‌ కాలేజీలో సీటొచ్చింది. కానీ అది ఇష్టంలేక నిజాం కాలేజీలోని మైక్రోబయాలజీ డిగ్రీలో చేరారు. 1996-98 ఎమ్మెస్సీ, (బయోటెక్నాలజీ) పూణే యూనివర్సిటీ, ముంబాయి. అమెరికాలోని సిటీ యూనివర్సిటీ ఆఫ్‌ న్యూయార్క్‌ 1998-2000 ఎంబీఏ పూర్తిచేశారు. అనంతరం అమెరికాలోని ఇంట్రా ప్రైవేట్‌ కంపెనీలో ఐదేళ్ల పాటు ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా ఉద్యోగం చేశారు. ఇక‌, తెలంగాణ మ‌లిద‌శ ఉద్యమంలో భాగం అయ్యేందుకు అమెరికాలో ఉద్యోగాన్ని వదిలి 2004 నుంచి పరోక్ష రాజకీయాల్లోకి వచ్చాడు. 2004 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ లోకసభ స్థానం నుంచి గెలిచిన కేసీఆర్.. తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం నిర్లక్ష్యం చూపడంతో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రపంచానికి చాటేందుకు 2006లో ఎంపీ పదవికి రాజీనామా చేసాడు.. తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కేసీఆర్ 2 లక్షల పైచిలుకు మెజార్టీతో గెలుపొందాడు. ఆ ఉప ఎన్నికల్లో కేటీఆర్ చురుకైన పాత్ర పోషించారు…2008లో మరోసారి కేసీఆర్‌తో పాటు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికల బరిలోకి దిగినప్పుడు సిరిసిల్ల నియోజకవర్గంలో విస్తృత స్థాయిలో ప్రచారం చేసి తనదైన ముద్ర వేసుకున్నారు కేటీఆర్. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి తొలిసారిగా పోటీచేసి, తన సమీప ప్రత్యర్థిపై 171 ఓట్ల మెజార్టీతో గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టాడు. తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తిరిగి 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో 68,219 ఓట్ల భారీ మెజార్టీతో రెండోసారి గెలుపొందారు..

ఇక‌, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 53,004 ఓట్ల మెజార్టీతో గెలుపొంది తొలిసారి ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమల శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు… 2018 ముందస్తు ఎన్నికల్లో 89,009 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. 2018 డిసెంబరు 17న టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ త‌ర్వాత వ‌చ్చిన అన్ని ఎన్నిక‌ల్లో కీల‌క భూమిక పోషించారు.. కొంత‌కాలం పూర్తిగా పార్టీ ప‌టిష్ట‌త‌మైనే దృష్టిసారించిన కేటీఆర్.. 2019 సెప్టెంబరు 8న మ‌ళ్లీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రస్తుతం ఐటీ మున్సిపల్‌, పరిశ్రమల శాఖల బాధ్య‌త‌లు చూస్తున్నారు.. ఓవైపు పార్టీ.. మ‌రోవైపు పాల‌న‌.. రెండు బాధ్య‌త‌ల‌కు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా... త‌న‌దైన ముద్ర‌వేస్తూ.. ముందుకు సాగుతున్నారు.. ఆయ‌న‌. ఒక రాజకీయ నాయకుడుగా కాకుండా.. సామాన్యుడిగా ప్రజలకు ఏ అవసరం వచ్చినా ప‌రిష్కారం చూపుతార‌నే పేరుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కేటీఆర్ నెటిజన్స్ ఆయన దృష్టికి తీసుకువచ్చిన ప్రతీ సమస్యను తీరుస్తూ వ‌స్తున్నారు. విదేశాల్లో పని చేస్తూ అష్ట కష్టాలు పడుతున్న తెలంగాణవాసులను రాష్ట్రానికి తీసుకుంచ్చే విషయంలో కీలకంగా వ్య‌హ‌రించారు.. నిత్యం ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండే జ‌న‌హృద‌య నేత రామ‌న్న‌కో మ‌రోసారి పుట్టిన రోజు శుభాకాంక్షలు..