చివరి బస్తా వరకు కొంటాం..

చివరి బస్తా వరకు కొంటాం..

రైతుల వద్ద నుంచి చివరి బస్తా వరకు కొనుగోలు చేస్తామన్నారు తెలంగాణ ఆర్ధిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్. ఆకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న ధాన్యం..రైతుల సమస్యలపై ఆయన స్పందిస్తూ.. ఆకాల వర్షాల కారణంగా పాడైపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని.. రాష్ట్ర వ్యాప్తంగా అధిక సంఖ్యలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. తెల్లరేషన్ కార్డ్ ద్వారా బియ్యం తీసుకుని బ్రోకర్లకు అమ్మరాదని.. పేదల కోసం పెట్టిన పథకం దుర్వినియోగం కాకుండా చూడాలని ఈటెల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పరిమితి లేకుండా ప్రతి మనిషికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నామని.. బియ్యం అక్రమ రవాణా చేసిన వారిపై పీడీ యాక్ట్ పెడతామని.. డీలర్లు ఈ పాస్ పద్ధతి పెట్టాక దారిలోకి వచ్చారని అన్నారు. అతి త్వరలోనే డీలర్ల కమిషన్ పెంచటంపై నిర్ణయం తీసుకుంటామని రాజేందర్ వెల్లడించారు.