మంత్రి బాలినేని స‌వాల్‌.. ఆ విష‌యం నిరూపిస్తే రాజీనామా..!

మంత్రి బాలినేని స‌వాల్‌.. ఆ విష‌యం నిరూపిస్తే రాజీనామా..!

టీడీపీ నేత‌ల‌కు స‌వాల్ విసిరారు ఏపీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస్ రెడ్డి‌.. నా ముప్పై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఒక మచ్చ కూడా లేద‌న్న ఆయ‌న‌.. దొరికిన డబ్బులు నావి అని.. టీడీపీ నేత‌ బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు నిరూపిస్తే.. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..  అంతేకాదు రాజ‌కీయాల నుంచి కూడా త‌ప్పుకుంటాన‌ని ప్ర‌క‌టించారు. ఇక‌, బోండా ఉమకు నాపై విమర్శలు చేయ‌డానికి సిగ్గు ఉండాలంటూ ఫైర్ అయిన బాలినేని.. నాపై తప్పుడు ఆరోపణలు చేసిన బోండా ఉమ‌.. క్షమాపణలు చెప్పాల‌ని డిమాండ్ చేశారు.. మ‌రోవైపు నారా లోకేష్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు బాలినేని.. లోకేష్‌కు నన్ను విమర్శించే స్థాయి లేద‌న్న ఆయ‌న‌... నా పై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాన‌ని వెల్ల‌డించారు.. నేను తలచుకుంటే ప్రకాశం జిల్లాలో టీడీపీ లేకుండా చేస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చారు మంత్రి బాలినేని. కాగా, త‌మిళ‌నాడులో ప‌ట్టుప‌బ‌డిన ఓ కారులో.. భారీగా బంగారం, న‌గ‌దు దొర‌క‌గా.. దానిపై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.. దీనిపై స్పందించిన బాలినేని టీడీపీ నేత‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చారు.