నాకు మంత్రి పదవి రావడానికి కారణం ఆయనే: మాణిక్యాలరావు

నాకు మంత్రి పదవి రావడానికి కారణం ఆయనే: మాణిక్యాలరావు

ఈ రోజు జరిగిన ఏపీ అసెంబ్లీలో మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ… మొదటగా మంత్రిగా అవకాశం ఇచ్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు అని అన్నారు. అలాగే సోము వీర్రాజు, తాడేపల్లి ప్రజలకు కృతజ్ఞతలు అని తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే తాను రాజీనామా చేయాల్సి వచ్చిందని చెప్పారు. విశాఖను వాణిజ్య రాజధానిగా అభివృద్ధి చేశామని చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయకముందే… రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై చంద్రబాబు ఒత్తిడి తెచ్చారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్ఫూర్తితోనే నేను చాలా నేర్చుకున్నాను అని పేర్కొన్నారు.

దేవాదాయ శాఖ మంత్రిగా తన శాఖలో మార్పులు తీసుకొచ్చేందుకు పని చేశానని అన్నారు. తనకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరుతున్నానని అన్నారు. మంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ.. నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడే ఉంటానని చెప్పారు. తనకు మంత్రి పదవి రావడానికి కారణం ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడేనని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజ్యసభలో వెంకయ్య నాయుడు చేసిన పోరాటం గొప్పదని కొనియాడారు. మరింత సమాచారం కోసం పైన వీడియోను క్లిక్ చేయండి.