యూపీలో వలస కూలీల బస్సు బోల్తా..35మందికి గాయాలు.!

యూపీలో వలస కూలీల బస్సు బోల్తా..35మందికి గాయాలు.!

యుపిలో వలస కూలీలు ప్రయాణిస్తున్న వాహనాలు ప్రమాదాలకు గురి కావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా శనివారం తెల్లవారుజామున కూలీలు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. జైపూర్ నుండి పశ్చిమ బెంగాల్ వెళ్తున్న బస్సు యూపీలో ప్రమాదానికి గురైంది.  సహవ్‌పూర్ సమీపంలో బస్సు హైవేపై అదుపు తప్పి పడిపోయింది. డ్రైవర్ నిద్రలో ఉండటంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక్క సారిగా తెల్లవారుజామున ప్రమాదం జరగటం తో కూలీలు ఉలిక్కిపడ్డారు. వారి రోదనలు విన్న వాహనదారులు పోలిసులకు సమాచారం అందించడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు క్షతగతులను ఎస్ఆర్ఎన్ ఆస్పత్రికి తరలించారు.