టీ 20 ప్రపంచ కప్ జరగడం ఓ పీడకల .. 

టీ 20 ప్రపంచ కప్ జరగడం ఓ పీడకల .. 

ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్మెన్ మైఖేల్ హస్సీ ముందుగా అనుకున్న విధంగా అక్టోబర్-నవంబరులో 2020 టీ 20 ప్రపంచ కప్ జరగడం, దానికి ఆసీస్ ఆతిథ్యం ఇవ్వడం అనేది పీడకల అని చెప్పాడు. ''ప్రస్తుత పరిస్థితులలో షెడ్యూల్ ప్రకారం ప్రపంచ కప్‌ ను నిర్వహించడం సాధ్యం కాదు, కానీ ఐసీసీ ఈ  విషయం పై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు . అయితే ఇప్పుడు క్రికెట్ ఆడటానికి ఒక జట్టును తీసుకురావడం వారిని సురక్షితంగా ఉంచడం చాల కష్టం. అలాంటింది ఈ సమయం లో ప్రపంచ కప్ కోసం 16 జట్లను తీసుకురావడం మరియు వారికి అన్ని వసతులు కల్పించడం అనేది ఓ పీడకల అని నేను భావిస్తున్నాను'' అంటూ హస్సీ చెప్పాడు. 2021 లేదా 2022 లోకి టీ  20 ప్రపంచ కప్ వాయిదా వేయవలసి ఉంటుంది అన్నారు. ఇక ఈ ఏడాది చివర్లో జరగాల్సిన భారత ఆసీస్ పర్యటన ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళే అవకాశం ఉందని హస్సీ తెలిపారు. కానీ ఒక్క ఆటగాడు కరోనా బారిన పడితే సిరీస్‌ను విరమించుకోవలసి ఉంటుందని, ఇలా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉందని హస్సీ చెప్పాడు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.