ధోని ఇంకా 10 ఏళ్ళు క్రికెట్ ఆడాలి...

ధోని ఇంకా 10 ఏళ్ళు క్రికెట్ ఆడాలి...

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని భవిష్యత్తు పై చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అతని ఆట ముగిసింది అంటున్నారు. అయితే మాజీ ఆస్ట్రేలియా, చెన్నై సూపర్ కింగ్స్ బాట్స్మెన్ మైఖేల్ హస్సీ మాత్రం ఎంఎస్ ధోనికి వీలైనంత కాలం తన ఆట కొనసాగించాలని, ఆయన కనీసం మరో 10 సంవత్సరాలు అయిన ఆడాలి అని తాను కోరుకుంటున్నట్లు తెలిపాడు. అలాగే "నేను కెప్టెన్‌గా ఎంఎస్‌ను ఇష్టపడతాను , నాకు అతనిలోని ప్రశాంతత, ఆటగాళ్లకు మద్దతు ఇవ్వడం అలాగే వారిపై విశ్వాసం ఉంచడం నాకు చాలా ఇష్టం అని తెలిపాడు. ఇక 2019  ప్రపంచ కప్ లో భారత్ సెమీ-ఫైనల్ ఓడిన తర్వాత నుండి ధోని మళ్ళీ క్రికెట్ ఆడలేదు. తన అంతర్జాతీయ భవిష్యత్తు గురించి ఊహాగానాలు చెలరేగినప్పటికీ, ధోని మాత్రం సైలెంట్ గా ఉన్నాడు. అయితే బీసీసీఐ కూడా తన  కాంట్రాక్ట్ లో ధోనికి చోటు కల్పించకపోవడంతో అందరి  అనుమానాలు బలపడ్డాయి. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.